contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాస్ పోర్టు బ్రోకర్ల చేతిలో రాష్ట్రం నాశనం … తెరాస పై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు

  • బ్రోకర్ల చేతిలో రాష్ట్రం బంది
  • పాస్ పోర్టు బ్రోకర్ల చేతిలో రాష్ట్రం నాశనం
  • ప్రజల మీద అప్పులు పెంచిన బిజెపి
  • సంపద సమానంగా పెంచడానికే వచ్చాం
  • కవిత వందకోట్లు ఎలా సంపాదించారో చెప్పాలి : డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: పాస్ పోర్టు బ్రోకర్ల చేతిలో తెలంగాణ దోపిడీకి,మోసానికి గురైందని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. బహుజన రాజాధికార యాత్రలో భాగంగా పారువెల్ల,ఖాసీంపేట మాదాపూర్, హన్మజీపల్లి, మైలారం,గన్నేరువరం గ్రామాల్లో బుధవారం రాత్రి కొనసాగింది. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకొని నేడు ఢిల్లీలో కార్యాలయాలు కడుతున్నారని విమర్శించారు.తెలంగాణలోని ప్రాజెక్టులన్ని తమ వర్గాలవారి చేతికి అప్పగించారని గుర్తుచేశారు.లక్ష పదిహేను వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమంది బిసిలు కాంట్రాక్టర్లు ఉన్నారని ప్రశ్నించారు.1700 కోట్ల విలువైన తుపాకుల గూడెం ప్రాజెక్టు ఆంధ్రకు చెందిన వ్యక్తికి కట్టబెట్టారని ఆరోపించారు.1300మంది అమరులు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని,వారి శవాలు కూడా నేను మోశానని,కానీ నేడు ఫలితాలు కేవలం ఒకే కుటుంబం అనుభవిస్తుందని తెలిపారు.మిడ్ మానేరు డ్యాం బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పేదలను మోసం చేసి దోచుకున్న సొమ్ముతోనే సొంత విమానం కొనుక్కున్నారని, కుటుంబ సభ్యులంతా ఫాం హౌస్ లు కట్టుకున్నారని పేర్కొన్నారు.కెసిఆర్ 300 ఎకరాల్లో,కెటిఆర్ 17 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారని మన గ్రామానికి మాత్రం కనీసం రోడ్లు,మిషన్ భగీరథ నీరు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.బహుజన రాజ్యం వస్తే సంపదనంతా జనాభా దామాషా ప్రకారం పేదలందరికి సమానంగా పంపిణి చేస్తామని హామీ ఇచ్చారు.బహుజన రాజ్యంలో పేదలు విమానం ఎక్కి విదేశాల్లో చదువుతారని తెలిపారు.కవిత వందకోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాల్లో ఉన్న నల్లదనం తెచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని చెప్పి మోడీ మోసం చేశారన్నారు.బిజెపి పాలనలో నల్లదనం మరింత పెరిగిందని ఆయన గుర్తుచేశారు.52 శాతం ఉన్న బిసిలకు కేవలం 27శాతం రిజర్వేషన్లు మాత్రమే కల్పించి బిసిలకు అన్యాయం చేస్తుందని,బిసిల కులగణన చేయని బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 ఏళ్లు ఎస్పిగా పనిచేసినపుడు ఈ ప్రాంతం అంతా తిరిగానని, ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలందరికి సంపద సమానంగా పంచి సమన్యాయం అందించేందుకు బిఎస్పి పార్టీలో చేరానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రాంచంద్రం, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మహిళా కన్వీనర్ సుమలత నియోజకవర్గ నాయకులు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :