ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం… ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. తెలంగాణలో ఆర్థిక శాఖను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి చూస్తున్నారు. ప్రధానితో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.