మెదక్ జిల్లా తూప్రాన్ : ప్రపంచ ఖ్యాతి పొంది అమరుడైన మహానేత గుమ్మడి విఠల్ రావు (గద్దర్) 77వ జయంతి వేడుకలు జనవరి 31 శుక్రవారం నాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. గద్దర్ అమర్ హై అంటూ నినదిస్తూ ఆయన సేవలను గుర్తు చేశారు. గద్దర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నె శ్రీనివాస్ రావు, సామల అశోక్, పర్శ నర్సింగ్ రావు, ఏర్పుల రాము, బల్ రాజు, ప్రవీణ్ కుమార్, చిట్టిమిల్ల అనిల్ కుమార్, సత్తయ్య, రాములు, చిన్నింగ్ మల్లిఖార్జున్ గౌడ్, జీడిపల్లి బాలయ్య, సాయి సమ్మర్, తదితరులు పాల్గొన్నారు.
