మెదక్ జిల్లా, తూప్రాన్: తూప్రాన్ పట్టణంలో హోటల్, ధాబా, టీ పాయింట్ యాజమానులతో తూప్రాన్ డీఎస్పీ నరెందర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్, నర్సాపూర్, వెల్దుర్తి, మాసాయిపేట, రామాయంపేట, నార్సింగి, శివంపేట్ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్సైలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నరెందర్ గౌడ్ మాట్లాడుతూ, హోటళ్లు, ధాబాల్లో మద్యం తాగడానికి సిట్టింగులు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. ప్రతి వ్యాపార సంస్థ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా చూడాలని సూచించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినపుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవచ్చని అన్నారు.
అలాగే రాత్రి 11:30 గంటల తరువాత వ్యాపార దుకాణాలు మూసివేయాల్సిన నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని, 12 గంటల తరువాత ఎవరైనా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత వ్యాపార స్థలాలను సీజ్ చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మరో ముఖ్యమైన అంశంగా, అనుకోని ప్రమాదాలు జరిగితే బాధితులను ఆసుపత్రికి తరలించడంలో సహకరించాలంటూ వ్యాపార యజమా