తూప్రాన్ డివిజన్ — గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో తూప్రాన్ సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీడీవో షాలిని తెలిపారు.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరించబడనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంలో మండలంలోని గ్రామాలకు సంబంధించి నామినేషన్ కేంద్రాలను ఇలా విభజించారు:
నామినేషన్ కేంద్రాల వారీగా గ్రామాల జాబితా:
కేంద్రం – 1:
వెంకటాయిపల్లి
గుండ్రెడ్డిపల్లి
దాతర్పల్లి
కేంద్రం – 2:
ఇస్లాంపూర్
వెంకటరత్నపూర్
నాగులపల్లి
వట్టూర్
కేంద్రం – 3:
కోనాయిపల్లి
మల్కాపూర్
నర్సంపల్లి
కేంద్రం – 4:
ఇమాంపూర్
ఘనపూర్
యావాపూర్
కిష్టాపూర్
నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక స్క్రూటినీ, ఉపసంహరణ, అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల చేయబడుతుందని, అనంతరం అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తామని పేర్కొన్నారు.
తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 114 వార్డుల కు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులకే అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ సబ్మిషన్ సాఫీగా జరగేందుకు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
శనివారం ఉదయం నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఉచితంగా అందుబాటులో ఉంచుతారు. పాత కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన పక్షంలో నామినేషన్ ఫారంపై తహసీల్దార్ అటెస్టేషన్ చేస్తారని తెలిపారు. ఎన్నికల కేంద్రంలోకి ప్రభుత్వం గుర్తించిన అక్రెడిటేషన్ కార్డ్ కలిగిన జర్నలిస్టులకే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఏర్పాట్లను జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో జయచంద్రారెడ్డి, పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రంగకృష్ణ, ఎస్‌ఐ శివానందం ప్రత్యక్షంగా పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి షాలిని, ఎంఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీవో సతీష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










