చేగుంట (తూప్రాన్ డివిజన్) : తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన ఘటనను అధికారులు వెలుగులోకి తీసుకువచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామ పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో పెద్ద మొత్తంలో ఇసుక అక్రమంగా నిల్వ చేసినట్లు తెలిసింది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి సంయుక్తంగా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మండల రెవెన్యూ అధికారులతో కలిసి పంచనామా నిర్వహించారు.
దర్యాప్తులో భాగంగా సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆ ఇసుకను రెవెన్యూ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ చర్యలో రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ ఇసుక రవాణా మరియు నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.








