కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ అధ్యక్షతన… భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గ ఇంచార్జి గడ్డం నాగరాజు, జిల్లా శాఖ కార్యదర్శి గంగిపల్లి ఎంపీటీసీ రంగు భాస్కరా చారి హాజరై. వాజ్ పేయి దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. నేటి ఈ అభివృద్ధికి బాటలు నాడు వారు వేసినవే అని నేడు వారి ప్రియశిష్యుడైన ప్రధాని మోడీ ముందుకు తీసుకువెళ్తున్నారు. అని అన్నారు. భారతమాత ముద్దు బిడ్డ చిరస్మరనీయుడైన అయిన వాజ్ పేయ్ దేశం కోసం చేసిన సేవల్ని ఎంత చెప్పిన తక్కువేనని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు సైతం మెచ్చుకునే నాయకత్వం అటల్ జీ గారిదని అన్నారు. వారి వ్యక్తిత్వం నేటి యువకులకి ఆదర్శం అని కొనియాడారు.ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పాని తిరుపతి,ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణాచారి, మండల ప్రధాన కార్యదర్శులు సొన్నాకుల శ్రీనివాస్, వంగల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్, మాచర్ల కోటేశ్వర్,మార్కొండ రమేష్ పటేల్, ఎదులాపురం అశ్విన్ తేజ, నందగిరి బలరాం, అనిల్ రాజ్, వీర్ల మహేష్ పాల్గొన్నారు.
