కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు ఎస్సీ సబ్ ప్లాన్ కింద గ్రామ ప్రియ అనే నాటుకోడి రకాన్ని( కెవికె) కృషి విజ్ఞాన కేంద్ర జమ్మికుంట వారి ద్వారా రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. మండలంలోని గునుకుల కొండాపూర్, మాదాపూర్, గన్నేరువరం, ఖాసీంపేట గ్రామాలలోని రైతులకు నెల వయస్సు ఉన్న ఈ నాటు కోళ్లని ఖాసీంపేట రైతు వేదికలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కెవికె ఫిషరీ సైంటిస్ట్ జి ప్రభాకర్, ఏ ప్రశాంతి నాటు కోళ్ల పెంపకం మరియు వాటి మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం వ్యవసాయ అధికారి కిరణ్మయి,ఏఈఓ సౌమ్య, కీర్తి ఖాసీంపేట గ్రామ సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న, ఎంపీటీసీ ఏలేటి స్వప్న చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.
