విశాఖపట్నం ఎయిర్ పోర్టును ఈ నెల 15 నుంచి రాత్రి పూట మూసివేయనున్నారు. రన్ వే పునరుద్ధరణ పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు విమానాశ్రయం కార్యకలాపాలు నిలిపివేస్తారు. పునరుద్ధరణ పనుల కారణంగా దాదాపు 6 నెలల పాటు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రాత్రివేళ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
విమానాశ్రయం రాత్రివేళ మూసివేతపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తూర్పు నౌకాదళ కమాండింగ్ (ఈఎన్ సీ) అధికారులతో చర్చించారు. రన్ వే పునరుద్ధరణ పనుల నిమిత్తం విమానాశ్రయం మూసివేత తప్పనిసరి అని ఈఎన్ సీ చీఫ్ స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే, ఇక్కడి విమానాశ్రయంలో పగటిపూట సర్వీసులు పెంచుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
విశాఖలో తూర్పు నావికాదళ కమాండ్ ఉన్నందున ఇక్కడి ఎయిర్ పోర్టు నేవీ నియంత్రణలో ఉంటుందన్న సంగతి తెలిసిందే.