విజయనగరం జిల్లా, బొబ్బిలి: బొబ్బిలి శాసనసభ్యులు ఆర్. వి. ఎస్. కే. రంగారావు (బేబీ నాయన) 45వ జన్మదిన వేడుకలు మంగళవారం ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి కోట ప్రాంగణం వేడుకల వేదికగా మారింది.
ఈ కార్యక్రమానికి బొబ్బిలి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
బేబీ నాయనతో అభిమానులు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కోట ప్రాంగణంలో కోలాట బృందాలు ప్రదర్శనలు ఇస్తూ, “రేలారే రేలారే…” అంటూ సందడి చేశారు. పల్లకీ, పూల వర్షం, బాణసంచాతో జన్మదిన వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.
బేబీ నాయన మాట్లాడుతూ, “ప్రజల ప్రేమే నాకు బహుమతి. ఈ అభిమానానికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను” అని పేర్కొన్నారు. అనేకమంది లబ్ధిదారులకు ఉచిత వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా నిర్వహించబడ్డాయి.
ఈ వేడుకల ద్వారా బొబ్బిలిలో పండుగ వాతావరణం నెలకొంది.