వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ: నిన్న హైదరాబాదులో భార్య స్వాతిని అతి కిరాతకంగా హత్య చేసిన మహేందర్ రెడ్డి స్వగ్రామం కామారెడ్డిగూడలో హత్యకు గురైన స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. మహేందర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరాదని, అతనికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేసారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.