వికారాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 130 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి, డి.ఆర్.ఓ మంగ్లీ లాల్‌లకు వినిపించారు.
ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించి సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.