గుర్తుతెలియని వాహనం ఢీకొని 70 గొర్రెలు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా బొంరస్ పేట మండలంలోని తూంకిమెట్ల రోడ్డుపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు బొంరస్ పేట మండలంలోని నందార్ పూర్ గ్రామానికి చెందిన గిర్ని మల్కాప్ప , రాయికంటి ఎల్లప్పవిగా గుర్తించారు తెల్లవారుజామున గొర్ల మందను తీసుకొని వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
