వికారాబాద్ జిల్లా – పరిగి : సోమంగుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి పరిగి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు (నంబర్ TS 34 Z 0012) ఒక వ్యక్తిని ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిచెందాడు.
సమాచారం ప్రకారం, సావిత్రి స్టీల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు రోహిత్ దాస్ రోడ్డు దాటుతుండగా బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.