నెల్లూరు జిల్లా: జాతీయ మరియు రాష్ట్ర స్థాయి అవార్డు లను అందుకున్న వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు చుక్కల.పార్ధసారథి, డి.సాత్విక మరియు పి.వెంకటచైతన్య లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అభినందించారు.
జిల్లా పేరును జాతీయ స్థాయి నిలబెట్టటం చాల గర్వకారణమని కొనియాడారు.
వి ఎస్ యు ఎన్ ఎస్ ఎస్ సేవలు అభినందనీయం అని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అలాగే విశ్వవిద్యాలయ పేరును అలాగే జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరారు.
ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి గారు వి ఎస్ యు ఎన్ ఎస్ ఎస్ జిల్లాలో తమదైన శైలిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతుందని.
ఇలాంటి అవార్డ్స్ రావటం ఎంతో సంతోషదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. పి రామచంద్రా రెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య విజయానంద కుమార్ బాబు, ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం మరియు ఇతర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.