తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శుక్ర వారం ఉదయం 9 గంటలకు చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం జెండాకు వందనం సమర్పించి స్వాతంత్రోద్యమంలో అశువులు బాసిన త్యాగధనుల పోరాటాన్ని గుర్తు చేసుకుని ఘన నివాళులు అర్పించారు. అంతకు ముందు మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలు వేసి నమస్కరించారు. చంద్రగిరి నియోజక వర్గం నుంచి హాజరైన పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
