చౌడేపల్లి, తిరుపతి జిల్లా: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో చౌడేపల్లిలో వైకాపా శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. స్థానిక బస్టాండ్ వద్ద బాణాసంచాలు పేల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వైయస్సార్ విగ్రహం వద్ద పూలమాలలతో నివాళులర్పించి, “ధర్మం గెలిచింది” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువ నాయకులు, చౌడేపల్లి సర్పంచ్ శ్రీరామ్ భరత్ వరుణ్, యువ నేతలు హరీష్ రాయల్, పవన్ రాయల్, మంజునాథ్, శక్తి పేట శంకరప్ప, చౌడేపల్లి ఉపసర్పంచ్ అల్తాఫ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.