- ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 13న అమలాపురంలో బీజేపీ శ్రేణుల నిరాహార దీక్ష
- పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి
- బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీలను మోసగిస్తున్న వైసీపీ ప్రభుత్వం : పొనుగుపాటి శ్రీనివాస్
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో అమలు చేస్తున్న 26 సంక్షేమ పథకాలను రద్దు చేయడమే కాకుండా, సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళిస్తూ రాష్ట్రంలోని ఎస్సీ వర్గాలను గత మూడేళ్లుగా దారుణంగా మోసం చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనుగుపాటి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆదివారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎస్సీల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు, ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద చేపట్టే ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనుగుపాటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షుడు పలివెల రాజు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కర్రి చిట్టిబాబు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా ముఖ్య అథితిగా పాల్గొంటారని తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల ఇన్చార్జిలు, బీజేపీ అనుబంధ అన్ని మోర్చాల జిల్లా అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు , ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులు, సోషల్ మీడియా కన్వీనర్లు, అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు తదితర నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని
పొనుగుపాటి కోరారు.