కర్ణాటక : హవేరి జిల్లా హీరెకరూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. అదే గ్రామానికి చెందిన యువకుడు సదరు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో గ్రామస్తులు ఆ యువకుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని అర్ధనగ్నంగా ట్రాక్టర్ పై గ్రామంలో ఊరేగించారు. అయితే, ఆ యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు, యువకుడ్ని కూడా అదుపులోకి తీసుకుని అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువకుడ్ని ట్రాక్టర్ పై ఊరేగించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.