ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలా చనిపోవాలి అనే వీడియో చూసి ఓ బాలుడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హమీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిఖిల్ సాహూ అనే ఆరో తరగతి విద్యార్థి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేస్ టూ డై అనే వీడియో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడిది ఆత్మహత్య అన్న విషయం పోస్ట్‌మార్టంలో తేలిందని పోలీసులు తెలిపారు. అతడి నిర్ణయం వెనక కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.