వరసగా రెండవసారి గెలిచిన చరిత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ , వైఎస్సార్ లకు మాత్రమే ఉంది. చంద్రబాబు దానిని కంటిన్యూ చేయలేకపోయారు. మరి జగన్ తన తండ్రి వైఎస్సార్ అలాగే ఎన్టీఆర్ ల మాదిరిగా సెకండ్ టెర్మ్ అధికారం నిలబెట్టుకుంటారా…!
2004లో వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయిదేళ్ల పాటు పాలించిన తరువాత 2009లో ఆయన రెండవమారు ప్రజల తీర్పుని కోరారు. జనాలు ఆయన్ని ఆశీర్వదించి మరోమారు సీఎం గా పట్టం కట్టారు.
అయితే ఆ ఎన్నికల్లో మహా కూటమిని టీడీపీ ఏర్పాటు చేసింది. అందులో టీఆర్ఎస్ కమ్యూనిస్టులు కూడా భాగంగా ఉన్నారు. ఇలా అందరూ కలసి పోరాడినా కూడా వైఎస్సార్ గెలిచారు. మళ్లీ సీఎం అయ్యారు.
అలా వైఎస్సార్ కి రెండవమారు పట్టం కట్టినపో తీరులో జగన్ కి కూడా ప్రజలు ద్వితీయ విఘ్నం లేకుండా చాన్స్ ఇస్తారా అన్నది వైఎస్సార్ అభిమానులతో పాటు వైసీపీలోనూ చర్చ నడుస్తోంది..
అయితే టీడీపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఓడింది కాబట్టి ఏపీలో వైసీపీ కూడా ఓడిపోతుంది అంటున్నారు.
అయితే తెలంగాణాలో జరిగిందే జరగాలి అనుకుంటే 2018లో బీఆర్ఎస్ అక్కడ గెలిచింది మరి చంద్రబాబు ఏపీలో ఎందుకు గెలవలేదు అని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్ ఫ్యామిలీకి ఓటమి లేదని మరికొందరు వీరాభిమానులు అంటున్నారు.
అయితే సెంటిమెంట్లు రాజకీయాల్లో ఎంతవరకు పనిచేస్తాయన్నది ఆలోచించాల్సిందే అంటున్న వారూ ఉన్నారు.
అదే సమయంలో చంద్రబాబు దెబ్బ తిన్న పులి లాంటి వారని.. ఆయన అపర చాణక్యాన్ని కూడా తక్కువ చేయాల్సింది లేదని అంటున్నారు.