contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

NTV జర్నలిస్టు అరెస్టును ఖండించిన : జగన్

తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. పండుగ సమయంలో అర్ధరాత్రి పూట ఇళ్ల తలుపులు బద్దలుకొట్టి, ఎలాంటి చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిరంకుశ ధోరణికి స్పష్టమైన నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, “జర్నలిస్టులు నేరస్తులు కాదు, ఉగ్రవాదులు అంతకన్నా కాదు. అయినా వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదు. ఇలాంటి చర్యల వల్ల వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు. అంతేకాకుండా, మీడియా వర్గాలలో భయాందోళనకర వాతావరణం నెలకొంటుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని విమర్శించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని జగన్ హితవు పలికారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని, చట్టబద్ధమైన పాలనను కొనసాగించాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని జగన్ గట్టిగా డిమాండ్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, కానీ చట్టాన్ని అమలు చేసే విధానంలో హుందాతనం, పారదర్శకత ఉండాలని సూచించారు. జర్నలిస్టుల హక్కులను కాలరాయడం ద్వారా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :