జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో గల నిరుద్యోగ యువతీ / యువకులకు జాబ్ మేళ నిర్వయహించుటకు ఈ దిగువ తెలిపిన 12 వివిధ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల నందు ప్రవేశానికి నోటిఫికేషన్ జారీచేయడమైనది. శిక్షణ వ్యవధి (03/06) నెలలలో భోజన , వసతి సౌకర్యాలు కల్పిస్తారు మరియు ఏఏ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ నందు శిక్షణ పూర్తి చేసుకున్న వారికీ ఆ అనుబంధ సంస్థ లో ఉద్యోగం కల్పించబడును. కనీస అర్హత మరియు ఉతీర్ణత తదితర వివరాలు ఈ దిగువ తెలియచేయుడమైనది.
దరఖాస్తు చేయు విధానం : ఆసక్తి గల నిరుద్యోగ యువతీ / యువకులు ఈ క్రింద గూగుల్ లింక్ ద్వారా tinyurl.com/2s4x2j8h రిజిస్ట్రేషన్ చేసుకోగలరు లేదా మండల పరిషత్ అభివృద్ది కార్యాలయం లేదా మండల సమాఖ్య కార్యాలయం యందు తేదీ 11. 02. 2022 లోపు నమోదు చేసుకొనగలరని మరియు తేదీ 12. 02. 2022 ఉదయం 10. 00 గం. లకు ఎల్లంద క్లబ్ హౌస్, కలెక్టరేట్ భూపాలపల్లి నందు జాబ్ మేళా నిర్వహించబడునని జిల్లా కలెక్టర్ శ్రీ .భవేష్ మిశ్రా I.A S., గారు ఒక ప్రకటనలో తెలిపారు.
గమణిక: రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది