కొన్ని రోజుల క్రితం కిందట తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి.
జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు తెలిపారు. వలంటీర్ రాంబాబు ఈ కేసులో నిందితుడు అని వెల్లడించారు. ఓ అక్రమ సంబంధం వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. ఓ మహిళ భర్తను చంపేందుకు వలంటీర్ రాంబాబు కల్లులో గడ్డి మందు కలపాడని వివరించారు. ఈ కల్లు తాగినందువల్లే ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతుల్లో మహిళ భర్త గంగరాజు కూడా ఉన్నాడని వెల్లడించారు
కాకినాడలో జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు తెలిపారు. వలంటీర్ రాంబాబు ఈ కేసులో నిందితుడు అని వెల్లడించారు. ఓ అక్రమ సంబంధం వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. ఓ మహిళ భర్తను చంపేందుకు వలంటీర్ రాంబాబు కల్లులో గడ్డి మందు కలపాడని వివరించారు. ఈ కల్లు తాగినందువల్లే ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతుల్లో మహిళ భర్త గంగరాజు కూడా ఉన్నాడని వెల్లడించారు