కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాడ బాపురేడ్డి సం,, (32) శుక్రవారం సాయంత్రం నుండి కనిపించడం లేదని అతడి తండ్రి నాగిరెడ్డి శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందా నరసింహారావు శనివారం తెలిపారు. చాడ బాపురేడ్డికి పెళ్లయింది. శుక్రవారం సాయంత్రం సమయం సుమారు నాలుగు గంటల సమయంలో ఇంటి నుండి బయలుదేరి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతడి తండ్రి నాగిరెడ్డి తెలిపారు.
