జర్మినీ బహుళజాతి సంస్థ బాష్ హైదరాబాదుకు వస్తోందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ దిగ్గజం, ప్రముఖ గృహోపకరణాల సంస్థ తమ వ్యూహాత్మక కేంద్రంగా హైదరాబాదును ఎంచుకుందని తెలిపారు. బాష్ సంస్థ హైదరాబాదులో గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ సెంటర్ తో పాటు, పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుందని కేటీఆర్ వివరించారు. ప్రతిపాదిత కేంద్రాల ద్వారా సుమారు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.