- నూతన పింఛన్లు వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ద్వారా అందించాలి
- విలేకరుల సమావేశంలో ఎంపిడిఓ శ్రీనివాసరెడ్డి
కారంపూడి మండలంలో 15 గ్రామపంచాయతీలకు సంబంధించి 400 పింఛన్లు మంజూరు అయినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యలయంలో అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కారంపూడి సచివాలయం1.55, కారంపూడి2. 39, ఒప్పిచర్ల1. 28, ఒప్పిచర్ల2. 25, చినగార్లపాడు 25, చినకొదమగుండ్ల 17, చింతపల్లి 22, మిరియాల 46, పెదకొదమగుండ్ల 17, నరమాలపాడు 25, పేటసన్నేగండ్ల 32, గాదెవారిపల్లి 69, చప్పున మంజూరు అయ్యాయని దీనికి సంబంధించిన నగదు కూడా సచివాలయ వెల్ఫేర్ లా ద్వారా నిధులు డ్రా చేసి పంచాయతీ కార్యదర్శులకు అప్పగించటం జరిగిందని అయన తెలిపారు. గ్రామసచివాలయలలో పనిచేసే వాలంటీర్ల ద్వారా ఒకటవ తేదీన పంపిణి చేయించాలని కార్యదర్శులను ఆదేశించటం జరిగిందని నూతనంగా మంజూరు అయినా పింఛన్లను గ్రామవాలంటీర్లు ఆయా పరిధిలోని జడ్పీటీసీ, ఎంపిపి, ఉపఎంపిపి, సర్పంచులు తదితర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని వారి ద్వారా పంపిణి చేయించాలని ఇప్పటికే మండల స్పెషల్ ఆఫీసర్ ద్వారా తెలియపరిచినట్లు అయన తెలిపారు. ఆయా గ్రామాలలో వాలంటీర్లు గ్రామంలోని మసీదులు, దేవాలయాలలో మైకుల ద్వారా గ్రామంలో దండోరా వేయించి ప్రతిఒక్కరికి కొత్త పింఛన్లు అలాగే పాత పింఛన్లు అందేలా చర్యలు చేపట్టాలని ఎంపిడిఓ కార్యదర్శులను కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ విస్తరణ అధికారి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.