నిజామాబాద్ : వేల్పూర్ మండలం, పడగల్ గ్రామానికి చెందిన తలారి గోపిరాజు ఇటీవల హైదరాబాద్ లో గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ 8 యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో గుండెకు సంబంధించిన మందులపై గత ఏడాది పరిశోధన పత్రం సమర్పించారు. పరిశోధన పత్రం సమర్పణల తర్వాత డాక్టరేట్ గా ఎంపిక చేసి దాంతో తలారి గోపి రాజుకు గవర్నర్ తమిళసై సరదా రాజన్ చేతుల మీదుగా డాక్టరేట్ ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ డాక్టర్ ప్రధానోత్సవం డాక్టరేట్ పొందడం ఉంది తలారి గోపిరాజు ఆనందం వ్యక్తం చేశారు. తలారి గోపి రాజు
తల్లిదండ్రులు మాట్లాడుతూ మాది ఒక్క మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం, మా అబ్బాయి వ్యవసాయ పనుల్లో మాకు సహాయం చేస్తూ, ఉద్యోగం చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ పట్టు విడవకుండా చదివి ఈ రోజు డాక్టరేట్ పట్టా పొందినందుకు చాలా సంతోషంగా ఉందని తేదీ 15.07.2022 నాడు హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ సత్యనారాయణ, మరియు డాక్టర్ వి. కిరణ్ కుమార్ ప్రిన్సిపల్ ఆఫ్ మదర్ థెరిస్సా కాలేజ్ ఆఫ్ ఫార్మసీవారి ఆద్వర్యంలో తలారి గోపి రాజుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు, ఈరోజు గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా డాక్ట రేట్ పట్టా అందుకున్నందుకు, గోపి రాజు తల్లిదండ్రులు మాకు గర్వంగా వుంది వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు
