contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

పండుగలు శాంతి యుతంగా జరుపుకోవాలి: ఎసిపి సదయ్య

బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ శాంతి కమిటీ సమావేశంలో ఏసీపీ పోలీసుల సూచనలు, పాటించాలని సూచించారు. రంజాన్ పండుగను శాంతి, సామరస్యాలతో ప్రశాంతమైన వాతావారణంలో జరుపుకునేందుకు కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా అన్ని మతాల పండుగలను, ఇతర మతాల వారు గౌరవించి ప్రతి పండుగను సోదరభావంతో జరుపుకోవడం అనవాయితీగా వస్తుందన్నారు.

ముస్లిం సోదరీ సోదరులకు పవిత్రమైన మాసం రంజాన్ మాసం అని, ప్రార్థనలు చేసే నమాజ్ టైంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చిన స్పష్టంగా మత పెద్దలు తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. రంజాన్ మాసంలో చిన్న నుంచి పెద్దల వరకు దైవ నామస్మరణలో ఉంటారని, నెల రోజుల పాటు జరిగే ఈ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ పరంగా చేపట్టాల్సిన విధులు నిర్వర్తించడంతో పాటు పోలీసు శాఖకు సహకరించాలని ఏసీపీ కోరారు.

బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ ఆంజనేయులు, తాళ్ళగురిజాల రాజశేఖర్ వివిధ మతాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :