సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో రాజకీయం వేడెక్కింది కక్షలు కార్పన్యాలకు ఎప్పటినుండో పల్నాడు ప్రాంతం పేరుగాంచి రాజకీయ చక్రబంధంలో ఎన్నో మలుపులు తిప్పుతున్న పల్నాడు ప్రాంతం రాజకీయం ఈ సారి మరింత వేడెక్కింది.. అధికార పార్టీ లోని నాయకులు అసంతృప్తితో టిడిపి వైపు వెళుతుండగా వారిని బుజ్జగించేందుకు వైసిపి ప్రయత్నిస్తుంది. కులాలవారీగా విభజించి టిడిపి వైసిపి రాజకీయాలు మొదలుపెట్టగా అధికార పార్టీ నుంచి చేరే నాయకులను అయా కుల నాయకుల ద్వారా బుజ్జిగించే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారు. కొంతమంది అసంతృప్తి నాయకులు మాత్రం ఖరాఖండిగా టిడిపి వైపు వెళ్తున్నాం అంటూ కండవాలు వేసుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది నాయకులు ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు ఈసారి ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరింపులు పాల్పడుతుండగా బెదిరింపులకు తగ్గేది లేదంటూ అసంతృప్తి నాయకులు సైతం టిడిపి కండవాలు వేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో పల్నాడు రాజకీయ వాతావరణం హీటెక్కింది.
