- హిందూ సాంప్రదాయాలకు ఘోర అవమానం
- అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జీ తెలుగు ఛానల్
- హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
హైదరాబాద్ : హిందూ సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ .. గోరంగా అవమానపరుస్తున్నారు.. నేటి టీవీ సీరియళ్ళు . హిందూ మనోభావాలను పదే పదే కించపరుస్తున్న పట్టించుకునే నాధుడే లేడు. అడిగేవారు లేరు కదా అని అడ్డు అదుపు లేకుండా, భయం భక్తి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు జీ తెలుగు (Zee Telugu ) ఛానల్. హిందూ సంప్రదాయాలను ప్రపంచ దేశాలు గౌరవిస్తుంటే వీరు మాత్రం కించపరుస్తున్నారు. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే జాబిల్లీ కోసం ఆకాశమల్లే సీరియల్ లో హారతి తీసుకునే సీన్ లో హారతి తీసుకుంటున్నప్పుడు .. చెప్పులు , షూస్, వేసుకుని హారతి తీసునే సన్నివేశం చిత్రీకరించారు. ఈ సన్నివేశం ద్వారా ప్రజలకు ఎటువంటి సందేశాన్ని అందిస్తున్నారు ? అంటే రేపటి నుండి అందరు చెప్పులు వేసుకొని హారతి తీసుకోవాలా? లేక సంప్రదాయాలు పాటించాలా? అడిగేవారు లేరు కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారా ? ఛానల్ లో ఒక సీరియల్ కి ఎంతమంది పని చేస్తున్నారు ? ఛానల్ ఈపి ఏమి చేస్తున్నట్టు ? ప్రొడ్యూసర్ , డైరెక్టర్ , కో డైరెక్టర్ , అసోసియేట్ డైరెక్టర్ , ఎడిటర్ , సౌండ్ ఇంజినీర్ , డబ్బింగ్ .. ఇంతమంది కంటికి ఈ సన్నివేశం కదపడలేదా ? లేక తెలిసి మమ్మల్ని ఎవరు అడుగుతారు లే అనే ధైర్యమా ?. హిందువులందరు ఈ సన్నివేశం పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఛానల్ యాజమాన్యం బేషరతుగా హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ మతాన్ని , సంప్రదాయాలను కించపరిచేవిధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పలు హిందూ సంఘాలు హెచ్చెరిస్తున్నాయి.
చెప్పులు వేసుకొని హారతి తీసుకుంటున్న మహా నటులు