ప్రకాశం జిల్లా, చీమకుర్తి : ది రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించిన అధికారులు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో భారీ వర్షానికి రహదారులు జలమయ్యాయి. బుధవాడ కంకర మిల్లుల సమీపంలోని రోడ్డు దుస్థితి గురించి ది రిపోర్టర్ టీవీ నిన్న కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు ఈరోజు అద్వానంగా ఉన్న రోడ్డుకు తాత్కాలిక మరమత్తులు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మట్టితో చదును చేశారు. దీనివలన వాహనదారులకు కొంత ఊరట లభించింది. ప్రజా సమస్యల పై స్పందిస్తున్న రిపోర్టర్ టీవీ కి ప్రజలు కృతఙ్ఞతలు తెలిపారు.













