కరీంనగర్ జిల్లా: చొప్పదండి ఎస్సైగా మామిడాల సురేందర్ శుక్రవారం రోజున బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలోని వివిధ సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకెళ్తానని ముఖ్యంగా మాదకద్రవ్యాలపై దృష్టి పెట్టి మండల ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజల మన్ననాలను పొందుతానని అన్నారు. కరీంనగర్ పట్టణంలో వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ గా విధులు నిర్వహించారు. బదిలీపై చొప్పదండికి మామిడాల సురేందర్ వెళ్లారు.
