చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో రాష్ట్ర కూటమి పార్టీల ఆదేశాల మేరకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని ఆపరేషన్ సింధూర్ దేశం మొత్తం సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ నీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని పాకిస్తాన్ నుంచి దేశాన్ని రక్షించడంలో అమరులైన వీర జవాన్లకు ఎమ్మెల్యే శ్రద్ధాంజలి ఘటించారు. మన జాతీయ పతాకానికి గౌరవం, ఆపరేషన్ సింధూర్ విజయవంతం, మన వీర జవాన్లకు సంఘీభావం, దేశ రక్షణలో ప్రజల భాగస్వామ్యం గూర్చి తిరంగా ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి నాగాలమ్మ గుడి వద్ద నుండి , టవర్ క్లాక్ వరకు త్రివిధ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ భారీగా తిరంగా ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన భారతీయుడు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం అన్నారు. ఎమ్మెల్యే ర్యాలీలో దారి పొడవునా వందేమాతరం , భారత్ మాతాకీ జై అని నినదిస్తూ… జాతీయ జెండాను చేతపట్టి తిరంగా ర్యాలీలో ముందుకు సాగారు. తిరంగా ర్యాలీలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్న ప్రతి ఒక్కరికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ధన్యవాదాలు తెలిపారు.
