కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో వివిధ గ్రామాలలో ఉపాధి హామీ లో పని చేస్తున్న ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కి శనివారం సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ఆరు వారాల నుంచి డబ్బులు రాలేదని కూలీలకు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే డబ్బులు జమ చేయాలనీ అన్నారు. పని ప్రదేశంలో అన్ని రకాల వసతులు కల్పించాలని అన్నారు.. అలాగే వివిధ గ్రామాలలో నిర్మించినటు వంటి పశువుల పాక ల డబ్బులు కూడా రాలేదు అని నిర్మించి చాలా రోజులు అవుతుంది అని అన్నారు. వెంటనే డబ్బులు జమ చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, సహాయ కార్యదర్శి కూన మల్లయ్య, జిల్లా నాయుకుడు కాంతాల అంజిరెడ్డి, యువజన నాయకులు మోలుగురి ఆంజనేయులు, గ్రామ శాఖ సహాయ కార్యదర్శి బొమ్మకంటి ఆంజనేయులు, బుట్ల భాస్కర్, కూన కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
