అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ముందు 25వార్డుల్లో నెలకొన్న మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మురికి కాలువలు శుభ్రత, వీధి లైట్లు నిర్వహణ, రహదారుల్లో కుక్కల, కోతులు, ఆవుల బెడద ఎక్కువగా ఉన్నదని గత తొమ్మిది సంవత్సరాలుగా స్థానిక పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రభుత్వాలు మారిన రాజకీయ నాయకులు మారిన నేటి సమస్యను తీర్చలేదు. నూతనంగా రోడ్ల నిర్మాణాలు, కొత్త కాలువలు, ముఖ్యంగా గుత్తి కోట వీధుల నుండి వచ్చే మురికి నీరు, వర్షపు నీరు చర్చి వీధి, కురవ గేరి, దళిత కాలనీల మీదుగా పోయే పెద్ద వంక సేఫ్టీ వాల్ లేక పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక తక్షణమే మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా స్పందించి మౌలిక వసతులు నెలకొల్పాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాందాసు, పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శిలు నరసింహయ్య, వెంకట్ రాముడు, మధుసూదన్ రావు, నజీర్ ఆటో వర్కర్స్ నాయకులు సూరి, రజాక్, మహమ్మద్ వలి, మహిళా సంఘం నాయకురాలు మాముద, నూర్జహాన్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ భాష, డానియల్, రామకృష్ణ, షఫీ, గోపాల్, బుక్ స్టాల్ మళ్లీ తదితరులు పాల్గొన్నారు.










