కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్ నగర్ : కాగజ్‌నగర్ బస్‌స్టాండ్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లోన్ వెల్లి నుండి కాగజ్‌నగర్‌కు వచ్చే బస్సులో ప్రయాణించిన పడోరే సులోచన అనే మహిళ బస్సు దిగే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సులోచన తెలిపిన వివరాల ప్రకారం బస్సు నుండి దిగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని, బ్యాగ్ లో ఉన్న నగలు కనిపించకపోవడంతో ఆమె తక్షణమే బస్‌స్టాండ్ పరిధిలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తుల గుర్తింపునకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.










