జగిత్యాల జిల్లా,మెట్ పల్లి పట్టణం అరపేట శివారులో గల బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మాకొద్దంటూ విద్యార్థినిలు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా వేధింపులు ఎక్కువయ్యాయని విద్యార్థినిలే కాకుండా ఉపాధ్యాయులు కూడా వేధింపులకు లోనవుతున్నారని విద్యార్థినిలు మండిపడ్డారు. జాతీయ రహదారిని నిర్బంధించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అధికారులతో కలిసి నచ్చజెప్పె ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రిన్సిపల్ గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తుందని, ఇంటర్ సెక్షన్ వద్దంటుందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిలనే కాకుండా ఉపాధ్యాయునిలను వేధించడంతో ఇద్దరూ ట్రాన్స్ఫర్ చేసుకున్నారని అందువల్ల సిలబస్ పూర్తి కాలేదని అందువల్ల పరీక్షలు రాయలేని దుస్థితి నెలకొందని అన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ మాపై దాడులకు ప్రయత్నిస్తుందని అటువంటి ప్రిన్సిపల్ మాకొద్దంటూ నేడు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని లేదంటే రోడ్డుపై కూర్చుంటామని బీక్షించడంతో అధికారులు పూర్వాపరాలు పరిశీలించి ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థినిలు శాంతించారు.










