contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ట్రాన్స్‌ఫర్ స్టార్.. బదిలీలే ఆయనకు బహుమతులు..

  • 18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..
  • ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..
  • తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..
  • రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ అధికారి శ్రీరామ్ ప్రస్థానం..
  • వ్యవస్థతో యుద్ధం.. 30 సార్లు స్థానచలనం

 

కొందరు అధికారులు ఏళ్ళ తరబడి ఒకే చోట తిష్టవేసేందుకు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ, శ్రీరామ్ అనే పేరు వింటే ఆ వ్యవస్థే భయపడుతుంది. ఎందుకంటే ఆయన నిఘంటువులో రాజీ అనే పదానికి చోటు లేదు. 18 ఏళ్ళ సుదీర్ఘ పోలీస్ సర్వీసులో ఏకంగా 30 సార్లు బదిలీ కావడం అనేది భారత పోలీస్ చరిత్రలోనే ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన విషయం.. 2007లో ముదిగుబ్బలో ఎస్ఐగా ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీరామ్ అడుగు పెట్టిన ప్రతి చోటా చట్టాన్ని కాపాడటమే తన ధర్మంగా భావించారు. రాజకీయ ఒత్తిళ్ళను పట్టించుకోకుండా, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే ఆయన చేసిన నేరం.. అందుకే కేవలం 40 రోజులకే బదిలీ అయిన సందర్భాలు కూడా ఆయన కెరీర్‌లో ఉన్నాయి. కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, తాజాగా ప్రొద్దుటూరు.. ఇలా ఊర్లు మారాయి, కానీ ఆయన ధరించిన ఖాకీ డ్రెస్ విలువ మాత్రం మసకబారలేదు..

కుటుంబానికి దూరం.. ధర్మానికి దగ్గర
బదిలీ అంటే కేవలం ఒక ఊరు మారడం కాదు, కుటుంబం మొత్తం అతలాకుతలం అవ్వడం. 18 ఏళ్లలో 30 సార్లు సామాన్లు సర్దుకోవడం అంటే ఒక మనిషి ఎంతటి మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి.. వ్యక్తిగత సుఖాల కంటే వృత్తి ధర్మానికే ఆయన పెద్దపీట వేశారు. అందుకే ప్రజల దృష్టిలో ఆయన ట్రాన్స్‌ఫర్ స్టార్ “నిజాయితీగా ఉండటం కష్టమే కావచ్చు.. కానీ అది ఇచ్చే ఆత్మతృప్తి వెలకట్టలేనిదని శ్రీరామ్ పయనం నిరూపిస్తోంది. అధికారం ముందు తలవంచని ఇలాంటి అధికారులు ఉన్నంత కాలమే సామాన్యుడికి న్యాయంపై నమ్మకం ఉంటుంది. కుర్చీలు మారినా, ప్రాంతాలు మారినా.. శ్రీరామ్ లాంటి ‘రియల్ స్టార్’ల సంకల్పం ఎప్పటికీ మారదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :