contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాచర్లలో మండవ ఎంపీఎల్ క్రికెట్ పోటీలు

మాచర్ల: పల్నాడు ప్రాంతంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాచర్లలో మండవ ఎంపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మండవ ఎంపీఎల్ చైర్మన్ మండవ రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడు ప్రాంతంలో క్రీడలకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. యువత తమ ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శించేలా ఈ పోటీలు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

క్రికెట్ పోటీల కోసం క్రీడాకారుల ఎంపిక ప్రక్రియకు సుమారు నాలుగు నెలల పాటు తన సహచరులతో కలిసి కృషి చేసినట్లు మండవ రవి తెలిపారు. మొత్తం ఎనిమిది జట్లను ఏర్పాటు చేసి, ఒక్కో జట్టులో 20 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేసినట్లు చెప్పారు.

మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్థానిక యువకుల్లో ఎవరైనా ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదిగితే మాచర్ల ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందని అన్నారు.

మండవ ఎంపీఎల్ నిర్వహణకు సుమారు రూ.42 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన పోటీల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, గతంలో పలు సేవా కార్యక్రమాల ద్వారా మండవ రవి ప్రజలకు చేరువయ్యారని స్థానికులు పేర్కొన్నారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఆయన మళ్లీ సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం పట్ల పలువురు యువకులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాచర్లకు చెందిన సీనియర్ జర్నలిస్టులు గాడిపర్తి శ్రీనివాసరావు, ఎం.ఎస్. నాగేశ్వరరావు, రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గతంలో మండవ రవి ఆధ్వర్యంలో సుమారు రూ.3 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు డాక్టర్ కే.పీ. చారి, అన్వర్, చిన్ని, సీత అంజి, వెంకటరెడ్డి, సాంబశివరావు, వాసు, పాటిబండ్ల చెన్నకేశవ, షేక్ ఖాసిం, నజీర్ మాస్టర్, నారాయణ, వేణుగోపాల్, ఇమామ్, ప్రవీణ్, కిరణ్, నవీన్‌తో పాటు మీడియా ప్రతినిధులు, జట్టు యజమానులు, ఇతరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :