contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి డా. రసమయి బాలకిషన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలకు, పార్టీ నాయకులకు మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ పనిచేస్తున్న రైతులు, హమాలీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి అంజనేయులు, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు కుసుంబా నవీనతో పాటు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు మీసాల ప్రభాకర్, న్యాలపట్ల శంకర్ గౌడ్, పంబల ఎల్లయ్య, గంట సంతోష్, పిట్టల రాము, మోహన్ పాల్గొన్నారు.

అలాగే సీనియర్ నాయకులు న్యాత సుధాకర్, పుల్లెల లక్ష్మణ్, కొట్టే భూమయ్య, చింతల రవి, బోయిని అంజయ్య, పురుషోత్తం కిషన్ గౌడ్, జక్కనపల్లి సత్తయ్య, బోయిని బాలయ్య, బొడ్డు బాలయ్య, సమ్మెట అనిల్ తదితరులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :