గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.
గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులతో చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే నాయకులకు సూచించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని రాజ్ ఠాకూర్ తెలిపారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెంచుకుని పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








