జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. స్వతంత్ర భారతదేశంలో 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి పేదలను,దళితులను అభివృద్ధి బాటలో నడిపించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అనగదొక్కే ఉద్దేశంతో అకారణంగా రాహుల్ గాంధీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీకి రానున్న ఎన్నికలలో దేశ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిజెపి పార్టీ నరేంద్ర మోడీ తన అహంకార ధోరణితో అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ నల్ల డబ్బు వెలికి తీసి పేద ప్రజలకు పంచుతానని హామీలు ఇచ్చి గద్దెలెక్కిన తర్వాత దోచుకున్న దొంగలను విదేశాలకు పంపి పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,ప్రజలు నరేంద్ర మోడీకి గట్టి గుణపాఠం చెప్పి గద్దె దించే వరకు ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని జువ్వాడి హెచ్చరించారు.









