గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. లేబర్ కోర్టు సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణితో పాటు బీజేపీ నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కందుల సంధ్యారాణి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దొరలు, భూస్వాముల పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. బెదిరింపులు, లాఠీ దాడులు ఎదురైనా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడారని కొనియాడారు.
చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరుకొండ అపర్ణ, జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య, అందె రాజకుమార్, బూడిద హర్ష, నడిగోటు రాజేందర్, బొడ్డుపల్లి రంజిత్, ఆరుకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.








