contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మంచినీరు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

తూప్రాన్ : ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ సూచించారు.

తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి, పలు అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాలో నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని అన్నారు. అలాగే పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సమతా కాశి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :