గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు, తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఇన్‌చార్జి ఎంపీడీఓ సురేందర్ హాజరయ్యారు. వారు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, నిజాం-రజాకార్లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చాకలి ఐలమ్మ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రజక సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామంచ స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, రజక సంఘం అధ్యక్షుడు మునిగంటి మల్లయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మతంగి అనిల్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్, గన్నేరువరం కార్యదర్శి వెంకటరెడ్డి, వార్డు సభ్యులు మచ్చ సాయి కృష్ణ, యాదవ సంఘం మండల అధ్యక్షుడు సందవేణి ప్రశాంత్, నాయకులు మునిగంటి రాములు, లింగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.








