contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట, గునుకుల కొండాపూర్, చాకలివానిపల్లి గ్రామాల్లో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.

ఖాసీంపేట గ్రామంలో సర్పంచ్ కర్నే చంద్రయ్య, ఉప సర్పంచ్ సందవేణి ఐలయ్య చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గునుకుల కొండాపూర్‌లో సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ఆధ్వర్యంలో, చాకలివానిపల్లిలో సర్పంచ్ రేపాక బానవ్వ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని, యువత ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, గునుకుల కొండాపూర్ ఉప సర్పంచ్ నాలపట్ల రాజు, మాజీ జెడ్పీటీసీ గుడెల్లి తిరుపతి, కార్యదర్శి రాజేష్, చాకలివానిపల్లి పంచాయతీ కార్యదర్శి ఇట్టం రాజు, పాలకవర్గ సభ్యులు చుక్కల లక్ష్మయ్య, నేలపట్ల పరుశురాం గౌడ్, ఆరే సంఘం అధ్యక్షుడు సింధు సత్తయ్య, రజక సంఘం అధ్యక్షుడు లింగంపల్లి అనిల్, లింగంపల్లి సమ్మయ్య, నేలపట్ల తిరుపతి, డాక్టర్ నిహారిక, వైద్య సిబ్బంది, కారోబార్ ముల్కల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే కొంకటి గణేష్ శేఖర్, నక్క మల్లయ్య, కోడూరి బాబు, బామండ్ల ఆనంద్, రేపాక బాబు, రజక సంఘం ఉపాధ్యక్షుడు గంగిపల్లి ముత్తయ్య, మునిగంటి సంతోష్, వంశి సాయి, శ్రీనివాస్, శేఖర్, వెంకటేష్, ప్రవీణ్, సాయి, సంపత్, రాజేందర్, రవి తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :