contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విద్యార్థి పై దాడి .. గోదావరిఖని ఉషోదయ స్కూల్ లో ఘటన

గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా: గోదావరిఖని రమేష్‌నగర్‌లోని ఉషోదయ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిపై పాఠశాల కరస్పాండెంట్ దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విఠల్‌నగర్‌కు చెందిన నాగేంద్ర అనే విద్యార్థి తనను వాటర్ ప్లాస్టిక్ పైపుతో కొట్టారని ఆరోపించాడు.

విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్భంగా పాఠశాల ఆవరణలో పులిహోర తయారు చేసేందుకు కట్టెలను ఏర్పాటు చేశారు. ఆ కట్టెలపై నాగేంద్ర మూత్ర విసర్జన చేశాడనే కారణంతో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తనను కొట్టారని విద్యార్థి పేర్కొన్నాడు.

అదే సమయంలో పాఠశాలలో ఓ బాలిక బ్యాగులోని డబ్బులు కనిపించకుండా పోయాయని కొందరు విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై నాగేంద్రతో పాటు మరో విద్యార్థి రాహుల్‌ను పాఠశాల యాజమాన్యం విచారణకు పిలిచినట్లు విద్యార్థి తెలిపాడు.

విచారణ సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, డబ్బులు తాను తీసుకోలేదని నాగేంద్ర కరస్పాండెంట్‌కు చెప్పినప్పటికీ తన మాట వినకుండా ఇద్దరు విద్యార్థులను బెదిరించి, అక్కడ ఉన్న ప్లాస్టిక్ వాటర్ పైపుతో కొట్టారని నాగేంద్ర ఆరోపించాడు.

దాడి కారణంగా తన తొడ భాగంలో ఎర్రటి వాతలు పడ్డాయని, మోకాలి కింది వెనుక భాగంలో వాపు వచ్చిందని విద్యార్థి తెలిపాడు. నొప్పి కారణంగా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలోనూ ఇదే విద్యార్థిపై దాడి జరిగిందని తల్లిదండ్రుల ఆరోపణ

నాగేంద్రపై ఇదే పాఠశాలలో గతంలో కూడా దాడి జరిగిందని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలో జరిగిన ఘటనలో విద్యార్థి చేతికి ఫ్యాక్చర్ అయ్యిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మరోసారి తమ కుమారుడిపై దాడి జరగడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులు తప్పు చేసినట్లు తేలితే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి తగిన విధంగా వ్యవహరించాల్సిందిపోయి, శారీరకంగా దాడి చేయడం సరైన పద్ధతి కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని విద్యార్థి కుటుంబం కోరుతోంది. అయితే పాఠశాల యాజమాన్యం వైపు నుంచి ఈ ఆరోపణలపై అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :