భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గత కొంత కాలంగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పూర్తీగా జలమయం అవ్వగా, ఎగువు ప్రాంతల నుండి వరద ఉదృతి పెరగడంతో గోదావరి ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని అందరికి తెలిసిన విషయమే. 1986 ఆగష్టు తర్వాత ఇలాంటి విపత్తు 2022 జులై లో మాత్రమే సంభవించిందని అధికార గణాంకాలు ద్వారా తెలిసిన విషయం. ఏకధాటిగా కురిసిన వర్షాలకు చేతిలో పని లేక, వరదలకు ఇల్లు నీట మునిగి కూలి నాలి చేసుకొనే ప్రజలు పుట్టెడు భాదల్లో ఉన్నారు. ఊరిలో రవాణా సౌకర్యం ఉన్నప్పటికి కార్పొరేట్ పాఠశాలలో చదివించే స్థోమత లేక కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల విధ్యా భారాన్ని తగ్గిస్తూ, నాణ్యమైన స్టేషనరీతో 2022-23 విద్య సంవత్సరం ప్రారంభించాలి అనే సదుద్దేశంతో చర్ల మండలం లోని గోదావరి పరివాహక ప్రాంతాలైన కొత్తపెల్లి, లింగాపురం, గొంపల్లి, మొగుళ్లపల్లి, ఆనంద్ కాలనీ, చింతకుంట, జి పి పల్లి గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే విద్యార్థులకు వారి విద్యకు అవసరమైన స్టేషనరీ అందించే దృఢ సంకల్పంతో “ఆధారం ఫర్ యు” సంస్థ అధ్యక్షుడు సంతోష్ కుమార్ చొరవ, స్పూర్తితో విరాళాలు సేకరించి, శనివారం మొదటి విడతగా కొత్తపెల్లి, లింగాపురం, గొంపల్లి గ్రామాలలోని విద్యార్థులు నూట యాభై నాలుగు మందికి, సోమవారం రెండవ విడతలో నూట ముప్పై ఆరు మంది విధ్యార్ధులకు వితరణ కార్యక్రమం జరిగింది. మొత్తం 290 మంది విద్యార్థులకు స్టేషనరీ వితరణ చేసినట్టు సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ కమిటీ సభ్యుడు ఉదయ్ నల్లూరి తెలిపారు. విరాళాల సేకరణకు సహాకించిన అందరికి ఈ సందర్భంగా ఉదయ్ నల్లూరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ విశ్రాంత ఉపాధ్యాయులు మామిడి రామచంద్రరావు, మొగళ్లపల్లి రామాలయం అర్చకులు సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిధులుగా పాల్గొనగా, శనివారం సీనియర్ ఉపాద్యాయులు జవ్వాది నరేంద్ర బాబు, కొత్తపెళ్లి, లింగాపురం, గొంపల్లి పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు, సోమవారం మొగళ్లపల్లి, చింతకుంట, ఆనంద్ కాలనీ, జి పి పెళ్లి ఉపాధ్యాయులు, రెండు రోజులు సంస్థ వలేంటర్లు మామిడి భానుచందర్, నవీన్, హర్షవర్ధన్, గ్రామాల వారీగా గ్రామస్తులు పాల్గొన్నారు.
