సంగారెడ్డి, అమీన్ పూర్ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. ఆషాడ మాసం పురస్కరించుకొని ఆదివారం మున్సిపల్ పరిధిలో నిర్వహించిన బోనాల పండుగలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/01/కనీసం-ఇద్దరు-పిల్లలుంటేనే-స్థానిక-ఎన్నికల్లో-పోటీకి-అర్హత-_-ఎపి-సీఎం-చంద్రబాబు.webp)